బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం పర్యటన ఏర్పాట్లు పూర్తి

59చూసినవారు
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కల్పనపై ప్రభుత్వం నియమించిన బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం ఆదిలాబాద్ లో సోమవారం పర్యటించనుంది. ఈ నేపథ్యంలో స్ధానిక జెడ్పీ సమావేశ మందిరంలో అధికారులు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, కుల సంఘ ప్రతినిధుల నుంచి దరఖాస్తులతో పాటు సూచనలను బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం స్వీకరించనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ అధికారి రాజలింగు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్