మహిళలకు రక్షణ కల్పించాలి

75చూసినవారు
దేశంలో మహిళలకు రక్షణ కరువైందని సిఐటియు జిల్లా కార్యదర్శి కిరణ్ ఆరోపించారు. కోల్కతాలో జరిగిన వైద్య విద్యార్థిని హత్యాచారం ఘటనను నిరసిస్తూ డాక్టర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా సిఐటియు నాయకులు శనివారం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి ఎదుట పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డ్స్ తో కలిసి ధర్నా నిర్వహించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకూ డాక్టర్లకు మద్దతుగా ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు.

సంబంధిత పోస్ట్