నెవాడా- అరిజోనా సరిహద్దులో ఉన్న ఐకానిక్ హువర్ డ్యామ్ ను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సీ అండ్ ఎండి బలరాం సందర్శించారు. ఉప ముఖ్యమంత్రి, సీ అండ్ ఎండి, ఇతర అధికారుల బృందం అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆనకట్ట మెకానిజం గురించి తెలుసుకున్నారు. ఇందులో ఒక్కొక్కటి 130 మెగావాట్ల ఉత్పత్తి చేసే 13 టర్బైన్ లతో పాటు 127, 68. 5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే రెండు అదనపు టర్బైన్ లు ఉన్నాయి.