గుడిహత్నూర్ మండలంలోని కొల్హరి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి బాలల దినోత్సవంను ఎంఈఓ అర్ ఉదయ్ గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భారత మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని అయన మాట్లాడుతూ ప్రతి పాఠశాల పిల్లల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉన్నదన్నారు.