ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలంలోని కుంటాల జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుండి వస్తున్న వరదకు నీరుతో ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో కుంటాల జలపాతం పరువల్లు తొక్కుతుంది. హోరుమని పెద్ద శబ్దాలతో జాలువారుతున్న నీరు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరోవైపు జలపాతం వద్దు పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.