ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు తగ్గట్లుగా నైపుణ్యాలను సాధించాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని శుక్రవారం తలమడుగు మండలం బరంపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆయన పరిశీలించారు. కాలానుగత వ్యాధుల అంశంపై విద్యార్థులకు అవగాహనా కల్పించారు. ఆరోగ్య పాఠశాల ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తూ ఇందులోని అంశాలపై అవగాహనా కల్పించుకుని ఆరోగ్యకర జీవనం గడపాలని దిశానిర్దేశం చేశారు.