గుడిహత్నూర్ మండలంలోని ఉమ్రి (జి) ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రతీ గదిని క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మధ్యహ్నం భోజనంలో చేసిన వంటల నాణ్యతా ప్రమాణాలను, వంట గదిని, సరుకులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.