తలమడుగు మండలం బరంపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు గ్రామస్థులు చేయూతనందించారు. ముడుపు మౌనిష్ రెడ్డి రూ. 1, 20, 000, డాక్టర్ రవికిరణ్ యాదవ్ రూ. 1, 00, 000, రాకేష్ రెడ్డి, మెరుగు ప్రభాకర్ రెడ్డి రూ. 96, 000, గ్రామాభివృద్ధి కమిటీ రూ. 66, 000 నగదును పాఠశాలకు అందజేసి ఉదారతను చాటుకున్నారు. ఎల్టి గోవర్ధన్ రెడ్డి బడితోట నిర్మాణానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు.