ఆదిలాబాద్: వరి పండించే రైతులకు సూచన
ఆదిలాబాద్ జిల్లాలో వరి కోతల తర్వాత వరి కొయ్యలని తగలబెట్టడం ద్వారా వాతావరణ కాలుష్యంతో ఊపిరితిత్తులలో వాయు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి తెలిపారు. అదేవిధంగా నెలలో సారం దెబ్బతింటుందని, నెలలో సూక్ష్మ జీవులు దెబ్బతిని జీవవైవిధ్యం దెబ్బతింటుందని కనుక పంట తీసిన తర్వాత వరి కొయ్యలని తగలబెట్టొద్దని అన్నారు. దీంతో పర్యావరణానికి తమ నేలలకి మేలు చేసినవారు అవుతారన్నారు.