భీమారం మండల కేంద్రానికి చెందిన మచ్చ విజయలక్ష్మి (31) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నది. ఈ క్రమంలో జీవితం పై విరక్తి చెంది శుక్రవారం ఇంటి వద్ద ఉన్న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. విజయలక్ష్మి సోదరుడు రాజబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై శ్వేత తెలిపారు.