చెన్నూర్ లో పిల్లలు పుట్టడం లేదని ఆత్మహత్య

62చూసినవారు
చెన్నూర్ లో పిల్లలు పుట్టడం లేదని ఆత్మహత్య
చెన్నూరు మండలంలోని చింతలపల్లికి చెందిన అల్లంపల్లి పోచన్న (38) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు చెన్నూర్ ఎస్సై శ్వేత మంగళవారం తెలిపారు. 13 సంవత్సరాల క్రితం స్వరూపతో వివాహమైనప్పటికీ పిల్లలు కాలేదు. దీంతో మద్యానికి బానిస అయ్యాడు. మద్యం మత్తులో ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. గతంలో కూడా పోచన్న రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్