సంపూర్ణంగా గుడిహత్నూర్ బంద్
గుడిహత్నూర్ ముస్లింల ఆరాధ్య దైవం మహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మండల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గుడిహత్నూర్ లో శనివారం బంద్ చేపట్టారు. మండల కేంద్రంలో అన్నీ వ్యాపార దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముస్లిం సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రవక్తపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తులకు అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని తెలియజేశారు.