నస్పూర్: రెండంతస్తుల బిల్డింగ్ పై నుంచి పడి కూలీ మృతి

61చూసినవారు
నస్పూర్: రెండంతస్తుల బిల్డింగ్ పై నుంచి పడి కూలీ మృతి
నస్పూర్ సీసీసీ కార్నర్ మేకల మండి ఏరియాలో నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనం పైనుంచి ప్రమాదవశాత్తు నీరజ్ బైసన్ (35) అనే వ్యక్తి
కిందపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై సుగుణాకర్ బుధవారం తెలిపారు. మృతునికి భార్య కల్పన, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

సంబంధిత పోస్ట్