దండేపల్లి మండలం లో స్త్రీ నిధి సోషల్ ఆడిట్ కు సమయాన్ని పొడిగించాలని యూనియన్ నాయకులు కోరారు. ఈ మేరకు సమాఖ్య ఏపీఎం కు వినతిపత్రం అందజేశారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ స్త్రీ నిధి రికవరీ విషయంపై అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. సమస్యలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్లడానికి మూడు నెలల సమయం ఇవ్వాలని వెల్లడించారు.