May 03, 2024, 08:05 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ ఘనతే
May 03, 2024, 08:05 IST
పేదలకు పని కల్పించాలని ఉద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం బేల మండలంలోని టాక్లి గ్రామంలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా మండల నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన గ్యారెంటీ కార్డును వారికి అందజేశారు.