భైంసా పట్టణం లోని ప్రాధమిక సహకార సంఘాల లో స్వల్పకాలిక రుణాలు పొందిన భైంసా మండలంలోని దేగాం గ్రామానికి చెందిన మార్రె ప్రభాకర్ ఇటీవల గుండే పోటు లో మృతి చెందాడు. రైతు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో క్రాప్ లోన్ తీసుకున్న సమయంలో ప్యాక్స్ బీమా తీసుకున్నాడు. బీమా కంపెనీ ద్వారా వచ్చిన రూ. 2 లక్షల చెక్కును మృతుని భార్య రాత్నకు ప్యాక్స్ చైర్మన్ అమెడ దేవేందర్ రెడ్డి అందజేశారు.