మహిళ మెడలోంచి బంగారు గొలుసు అపహరణ

74చూసినవారు
మహిళ మెడలోంచి బంగారు గొలుసు అపహరణ
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో మంగళవారం మహిళ మెడలోంచి బంగారు గొలుసును దుండగులు అపహరించారు. స్థానికుల వివరాల ప్రకారం పట్టణంలోని రాజీవ్ నగర్ కు చెందిన మంజుల ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి నడుచుకుంటూ వెళుతుండగా బైక్ వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోంచి రెండున్నర తులాల బంగారు గొలుసును అపహరించారు. దీంతో ఆమె కింద పడగా స్వల్ప గాయాలయ్యాయి చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్