మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం భైంసా మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం మండలంలోని పాంగ్రా గ్రామానికి చెందిన రాంకురే గణేష్ మద్యానికి బానిసై భార్య, అమ్మతో గొడవపడేవాడని శనివారం రాత్రి కూడా గొడవపడి మద్యం మత్తులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతురాలి భార్య గంగా సాగర ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.