ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS-RRB క్లర్క్ మెయిన్స్-2024 పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులను IBPS విడుదల చేసింది. www.ibps.in వెబ్‌సైట్‌లో శనివారం నుంచి అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డుని డౌన్‌లోడ్ చేయడానికి, అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేయాలి. అడ్మిట్ కార్డులు అక్టోబర్ 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. అదే రోజున మెయిన్స్ పరీక్ష జరగనుంది.