కుంటాల మండలం కల్లూరు వాగు చెక్ డ్యాం వద్దకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు ఎస్ఐ భాస్కరాచారి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం భైంసాకు చెందిన భోజారాం పటేల్ (53) కల్లూరు గ్రామంలో కూలీ చేసుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. బుధవారం కాలకృత్యాలు తీర్చుకునేందుకు చెక్ డ్యాంలోకి దిగాడు. ప్రమాదవశాత్తు జారిపడి ఈత రాక నీట మునిగి మృతి చెందినట్లు తెలిపారు.