రేషన్ డీలర్లను అరెస్ట్ చేసిన పోలీసులు

72చూసినవారు
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మంగళవారం రేషన్ డీలర్లు పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ పటాన్ చేరు జిఎంఆర్ గార్డెన్ లో నిర్వహించే చలో హైదరాబాద్ బహిరంగ సభకు బయలుదేరగా అడ్డుకొని పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించాలని వెళ్తున్న తమను అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు. రేషన్ డీలర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్