తన చేతిపై మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పచ్చబొట్టు వేయించుకొని నిర్మల్ పట్టణానికి చెందిన రామకృష్ణ అభిమానాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే అప్పాల గణేష్ చక్రవర్తి జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవార్పేట్ కు చెందిన రామకృష్ణ అనే యువకుడు మాజీ మున్సిపల్ చైర్మన్ పై ఉన్న అభిమానంతో పచ్చబొట్టు వేయించుకున్నారు. విషయం తెలుసుకున్న గణేష్ చక్రవర్తి మంగళవారం సదరు యువకుడిని పిలిచి ఆప్యాయంగా అభినందించారు.