నిర్మల్ గాంధీ పార్క్ సమీపంలో పెరిగిన చెట్ల కొమ్మలను కొట్టేందుకు బుధవారం చెట్టు ఎక్కిన ఓ వ్యక్తి మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం పట్టణంలోని వాల్మీకీ నగర్ కు చెందిన దూదేకుల కాసిం (47) చెట్ల కొమ్మలను కొట్టేందుకు చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కింద పడిపోగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.