తండ్రి మందలించాడని బాలుడు ఆత్మహత్య

4003చూసినవారు
తండ్రి మందలించాడని బాలుడు ఆత్మహత్య
మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడద్దని తండ్రి మందలించడంతో కుమారుడు మనస్థాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జట్ల రాకేష్ అనే బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. మొబైల్ ఫోన్ లో గేమ్స్ అడద్దని తండ్రి రాజేశ్వర్ కుమారుడిని గురువారం మందలించాడు. దీంతో మనస్థాపం చెంది ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్