ఫేక్ ఇన్స్‌స్టా ఐడీలతో బాలికలను వేధిస్తున్న నలుగురిపై పోక్సో కేసు నమోదు

84చూసినవారు
ఫేక్ ఇన్స్‌స్టా ఐడీలతో బాలికలను వేధిస్తున్న నలుగురిపై పోక్సో కేసు నమోదు
AP: కడప జిల్లా ప్రొద్దుటూరులో 32 ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీలతో తాను చదివే పాఠశాల విద్యార్థినులను వేధిస్తున్న 9వ విద్యార్థి సహా, అతనికి సహకరించిన మరో ముగ్గురిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తనను ప్రేమించాలని, లేదంటే మీ నెంబర్లు, ఫొటోలు, వీడియోలను అందరికీ పంపిస్తానని నిందితుడు బెదిరించేవాడని వారు చెప్పారు. బాలుడిని ప్రోత్సహించిన తల్లిదండ్రులు కొండమ్మ, మాధవరెడ్డి, కౌన్సిలర్ మురళీపై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్