వాట్సాప్ కాల్ చేసి.. మహిళకు రూ.1.12 లక్షలు టోకరా

59చూసినవారు
వాట్సాప్ కాల్ చేసి.. మహిళకు రూ.1.12 లక్షలు టోకరా
సైబర్ క్రైమ్ పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు హైదరాబాద్ కు చెందిన ఓ మహిళను బురిడి కొట్టించారు. మహిళకు వాట్సాప్ కాల్ చేసి.. తాము ముంబై సైబర్ క్రైమ్ పోలీసులమని చెప్పారు. మీ పేరుతో వచ్చిన పార్శిల్ లో నిషేధిత వస్తువులు ఉన్నాయన్నారు. కేసు నమోదు చేశామని, కేసు నుంచి బయట పడేయాలంటే డబ్బులు చెల్లించాలని బెదిరించారు. ఈ క్రమంలోనే బాధితురాలు ఖాతాలో ఉన్న రూ.1.12 లక్షలను కాజేశారు. దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్