అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అతుల్ బెంకే శనివారం ముంబైలో ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్‌ను కలిశారు. ఇక అతుల్ బెంకేను 'రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మీరు ఏ ఎన్‌సిపి వర్గంతో ఉంటారు' అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని ఆయన బదులిచ్చారు. అజిత్ పవార్ 2023 జూలైలో ఎన్‌సిపిని విభజించి, మహాయుతి కూటమిలో చేరారు. డిప్యూటీ సీఎం అయ్యారు.