నన్ను క్షమించండి.. స్టార్ హీరో సంచలన ప్రకటన

64చూసినవారు
నన్ను క్షమించండి.. స్టార్ హీరో సంచలన ప్రకటన
'బిచ్చగాడు' ఫేం విజయ్ ఆంటోని.. తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు విజయ్.. ఈ రోజు చెన్నైలో విజయ్ ఆంటోని 3.0 లైవ్ కాన్సర్ట్ ప్లాన్ చేశారు. కానీ అనుకోని పరిస్థితుల కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. దీంతో తన బాధను వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. 'హలో ఫ్రెండ్స్.. అనివార్య పరిస్థితుల దృష్ట్యా, విజయ్ ఆంటోని 3.0 లైవ్ కాన్సర్ట్‌ను మరో తేదీకి మార్చడం జరిగింది. మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించండి' అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్