అజిత్‌ సరసన శ్రీలీల?

71చూసినవారు
అజిత్‌ సరసన శ్రీలీల?
నటి శ్రీలీల ఈసారి తమిళ టాప్‌ హీరో అజిత్‌తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. అధిక్‌ రవిచంద్రన్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అజిత్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీలది ముఖ్య కథానాయిక పాత్ర అని సన్నిహితవర్గాలు తెలిపాయి. అయితే దీన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చే ఈ చిత్రం జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్