పెళ్ళి గౌనును రీమోడలింగ్‌ చేయించుకున్న సమంత

85చూసినవారు
పెళ్ళి గౌనును రీమోడలింగ్‌ చేయించుకున్న సమంత
సమంత తన పెళ్ళినాటి గౌనును రీమోడలింగ్‌ చేయించి ముంబై వేదికగా జరిగిన 'ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల' కార్యక్రమంలో ధరించింది. పెళ్ళి కోసం సమంత ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న వైట్‌ గౌన్‌ను ఇప్పుడు బ్లాక్‌ కాక్‌టైల్‌ స్ట్రాప్‌లెస్‌ గౌనుగా మార్చేసింది. తనకెంతో ఇష్టమైన గౌనును రీమోడలింగ్‌ చేయించి ఈ కార్యక్రమం కోసం ఉపయోగించినట్లు తెలిపింది. పాత దుస్తులను రీమోడలింగ్‌ చేయించడం కూడా జీవనశైలిని మరింత స్థిరంగా చేసుకోవడంలో ఒక భాగంగా పేర్కొంది.

సంబంధిత పోస్ట్