AP: ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభమౌంది. ఈ ఎన్నికల బరిలో మొత్తం 25 మంది నిలిచారు. అయితే ఆలపాటి రాజేంద్రప్రసాద్ (కూటమి), కేఎస్ లక్ష్మణరావు(పీడీఎఫ్) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. 2.41 లక్షల ఓట్లు పోలవగా, విజేత ఎవరో తేలేందుకు రెండు, మూడు రోజులు సమయం పట్టొచ్చు.