AP: ఈ నెల 8 నుంచి రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణా కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. 90 రోజుల పాటు టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు అందజేస్తామన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా 46,044 మంది బీసీ, 45,772 మంది ఈడబ్ల్యూఎస్, 11,016 మంది కాపు మహిళలను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు.