‘రామన్ రాఘవ్’ అనే బాలీవుడ్ మూవీ చూసి 13 ఏళ్ల బాలుడు ఓ బాలికను హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్‌ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. తన బంధువైన బాలిక (6)ను అందరూ ముద్దు చేస్తుండటాన్ని ఆ బాలుడు ఓర్వలేకపోయేవాడు. బాలికను అంతమొందించాలనుకున్నాడు. ‘రామన్ రాఘవ్’ సినిమాలోని క్రైమ్ సీన్ చూసి.. బాలికను శ్రీరామ్ నగర్ గుట్టపైకి తీసుకెళ్లి గోంతు కోసి, ఆపై బండరాయితో ఆమె ముఖాన్ని ఛిద్రం చేశాడు. పోలీసుల విచారణలో అసలు విషయం తెలిసింది.