రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అలియా భట్ నటిస్తున్న తాజా చిత్రం ‘జిగ్రా’. ‘ఆర్చీస్’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన వేదాంగ్ రైనా అలియా భట్ తమ్ముడిగా నటిస్తుండగా.. టాలీవుడ్ నటుడు రాహుల్ రవీంద్రన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేసింది.