విజయనగరంలో కూటమి క్లీన్ స్వీప్

79చూసినవారు
విజయనగరంలో కూటమి క్లీన్ స్వీప్
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2019 ఎన్నికల్లో టీడీపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈ ఎన్నికల్లో మొత్తం 9 స్థానాల్లో కూటమి విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ చేసింది. బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, కురుపాం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపు కోట, విజయనగరంలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందగా, నెల్లిమర్లలో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. గత ఎన్నికల్లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఈ ఎన్నికల్లో ఖాతా తెరవకపోవడం గమనార్హం.

సంబంధిత పోస్ట్