అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి జంటగా నటిస్తున్న చిత్రం తండేల్. ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ కూడా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 1న ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ హాజరుకానున్న మొదటి ఈవెంట్ ఇదే.