సినీ నటుడు అల్లు అర్జున్ మరి కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు రానున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ నేపథ్యంలో ప్రతి ఆదివారం పీఎస్ ముందు హాజరుకావాలని నాంపల్లి కోర్టు ఆయన్ను ఆదేశించిన విషయం తెలిసిందే. బెయిల్ షరతుల దృష్ట్యా అల్లు అర్జున్ చిక్కడపల్లి పీఎస్‌కు వెళ్లి సంతకం చేయనున్నారు. ఇప్పటికే ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.