AP: 5-15 ఏళ్లు నిండిన విద్యార్థులు, 45 ఏళ్లు నిండిన వారికి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిపై కార్యచరణ రూపొందించాలని మంత్రి సత్యకుమార్ అధికారులను తాజాగా ఆదేశించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కంటి పరీక్షలు నిర్వహించి.. ఉచితంగా 90 వేల కళ్లద్దాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. అలాగే నేత్రదానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.