చాలా మంది మహిళలకు వీపు, ఛాతీ, భుజాల మీద ఏర్పడే మొటిమలు సమస్యాత్మకంగా మారుతాయి. కొందరిలో మొటిమలు పోయినా, వాటి మచ్చలు అలాగే ఉంటాయి. అయితే కలబందతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అలోవెరా జెల్‌ను తొలగించి దానిని ఫ్రిజ్‌లో ఉంచాలి. కొంత సమయం తర్వాత ఈ చల్లని కలబంద జెల్‌తో వీపుపై బాగా మసాజ్ చేసుకోవాలి. 20 నిమిషాలు తర్వాత కడిగేయాలి. ఇలా వారంలో 2-3 రోజులు చేస్తే ప్రయోజనం ఉంటుంది. బేకింగ్ సోడా, నీటితో కలిపిన మిశ్రమాన్ని వీపుపై రుద్దినా మొటిమలు తగ్గుతాయి.