HMD ఎట్టకేలకు భారతదేశంలో తన Barbie Flip ఫోన్‌ను విడుదల చేసింది. ఇది ఫీచర్డ్ ఫోన్. వింటేజ్ ఫ్లిప్ ఫోన్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది 2.8-అంగుళాల ప్రధాన స్క్రీన్‌ను, అలాగే చిన్న 1.77-అంగుళాల కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ కాంపాక్ట్ మొబైల్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది 64MB RAM, 128MB స్టోరేజ్‌తో వస్తుంది. అదే సమయంలో 32GB వరకు ఎక్స్‌ట్రా స్టోరేజ్ విస్తరణకు మద్దతు ఇస్తుంది. Unisoc T107 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది.