కుప్పకూలిన విమానం.. 12 మంది దుర్మరణం

63చూసినవారు
కుప్పకూలిన విమానం.. 12 మంది దుర్మరణం
మధ్య అమెరికా దేశమైన హోండురాస్ తీరంలో ఓ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. లాన్హాసా ఎయిర్ లైన్స్ విమానం రోటన్ ద్వీపం నుంచి లా సీబా ప్రధాన భూభాగానికి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సముద్రంలో కూలిపోయింది. విమానంలో మొత్తం 17 మంది ప్రయాణికులు ఉండగా అందులో 12 మంది మరణించగా ఐదుగురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టినట్లు హోండురాస్ సివిల్ ఏరోనాటిక్స్ ఏజెన్సీ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్