తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మధురై సమీపంలోని ఓ ఫ్లైఓవర్‌పై అతివేగంగా వచ్చిన కారు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ మృతిచెందగా, ఇద్దరు పిల్లలు సహా ఆరుగురు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. చికిత్స నిమిత్తం గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.