AP: ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి త్వరలో కొత్త విధానాన్ని తీసుకువస్తామని మంత్రి దుర్గేష్ ప్రకటించారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. బుధవారం శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కేవలం షూటింగులు చేసి వెళ్లిపోవడం, మా దగ్గర ఆదాయం తీసుకోవడం మాత్రమే కాకుండా ఇక్కడ స్టూడియోలు నిర్మించాలని సినీ పెద్దలను కోరినట్లు తెలిపారు.