ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆర్డర్ డెలివరీ చేసేందుకు డెలివరీ బాయ్ గేటు తీసుకుని ఇంటి ప్రధాన ద్వారం గుండా లోపలికి వెళ్తాడు. ఆ వ్యక్తి పార్శిల్ ఇచ్చేలోపే, ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కలు అకస్మాత్తుగా అతని వైపు పరిగెత్తుకుంటూ వచ్చాయి. దీంతో ఆ వ్యక్తి భయంతో స్పైడర్ మ్యాన్ లాగా ఛాతీ అంత ఎత్తైన గేటుపై నుంచి అవలీలాగా దూకేశాడు. ఇది ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు.