ఆన్ ఫీల్డ్‌లో ఎంతో ఆవేశంగా, దూకుడుగా ఉంటూ టెంపర్ కోల్పోయే అంబటి రాయుడు ఆ రోజుల్లో లవ్ మ్యారేజ్ చేసుకుని అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. అసలు ప్రేమ పెళ్లి చేసుకున్నాడంటే నమ్మడం కష్టమే. అందుకే అతని వ్యక్తిగత జీవితం పూర్తిగా డిఫరెంట్ అనే చెప్పాలి. అంబటి రాయుడు తనతో పాటు కాలేజీలో చదువుకున్న చెన్నుపల్లి విద్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2009లో ప్రేమికుల రోజున వీరి వివాహం జరగడం విశేషం. వీరికి వివియ రాయుడు అనే కూతురు ఉంది.