అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ తొలిరోజే తాము WHO నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలపై చైనా స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలు ప్రపంచ ఆరోగ్య సంస్థను మరింత బలహీనం చేసేలా ఉన్నాయని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జియాకున్ పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్‌వోకు తమ మద్దతు కొనసాగుతుందని, ఆరోగ్యకర ప్రపంచం కోసం తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు.