పీచు మిఠాయి ఆశ చూపి.. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం

80చూసినవారు
పీచు మిఠాయి ఆశ చూపి.. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం
మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి భింద్ జిల్లాలో 8 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గోహద్ పట్టణంలోని ఓ కిరాణ షాపు యజమాని బాలికకు పీచు మిఠాయి ఇస్తానని ఆశ చూపి దారుణానికి ఒడిగట్టాడు. అనతరం బాలికకు రూ.20 ఇచ్చాడు. ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చిన బాలికను అనుమానంతో తల్లి ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్