వాహనంపైకి దూసుకొచ్చిన ఏనుగు.. మహిళ మృతి (వీడియో)

69చూసినవారు
ఆఫ్రికాలోని కఫ్యూ నేషనల్ పార్క్‌‌లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఏనుగు బీభత్సం సృష్టించి టూరిస్ట్‌లతో వెళ్తున్న సఫారీ వాహనంపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా.. పలువురు టూరిస్టులు గాయాలపాలయ్యారు. కొందరు పర్యాటకులు ఏనుగులను ఫోటోలు తీస్తుండగా ఓ ఏనుగు టూరిస్ట్‌ ట్రక్కును సుమారు అర కిలోమీటరు వరకూ వేగంగా వెంబడించింది. అనంతరం ట్రక్కుపై దాడి చేసి కిందపడేసింది. ఈ ఘటనలో 80 ఏళ్ల అమెరికన్‌ మహిళ మరణించింది.

సంబంధిత పోస్ట్