అండర్‌వేర్లతో కాంగ్రెస్‌పై వినూత్న నిరసన

81చూసినవారు
అండర్‌వేర్లతో కాంగ్రెస్‌పై వినూత్న నిరసన
లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఉచిత హామీలను ఎస్‌ఐఎఫ్‌ఎఫ్‌ తీవ్రంగా ఖండించింది. మహిళలకు ఉచితాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు అంటూ.. వాళ్లను ఆకర్షించేందుకు ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీ ప్రయత్నాలు చేయడాన్ని సేవ్‌ ఇండియన్‌ ఫ్యామిలీ ఫౌండేషన్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిపై ఆ సంఘం సభ్యులు మంగళవారం పలు చోట్ల తమ అండర్‌వేర్‌లను తగులబెట్టి నిరసనలు వ్యక్తం చేశారు. సగం కాలిన డ్రాయర్లను కాంగ్రెస్‌ పార్టీకి పంపిస్తామని అధ్యక్షుడు రాజేశ్‌ వఖారియా అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్