ఉద్యోగులందరికీ సంస్థలో వాటాలు: క్రిటికల్‌రివర్

52చూసినవారు
ఉద్యోగులందరికీ సంస్థలో వాటాలు: క్రిటికల్‌రివర్
సాంకేతిక సేవలసంస్థ క్రిటికల్ రివర్ తన ఉద్యోగులందరికీ సంస్థలో వాటాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఉద్యోగులందరికీ సంస్థలో యాజమాన్యం ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా తమ 9 కేంద్రాల్లో 1000 మందికి పైగా ఉద్యోగులున్నారని, వీరందరికీ ఎంప్లాయి స్టాక్ ఓనర్ షిప్ ప్లాన్ (ESOP) ద్వారా షేర్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. ఉద్యోగి పనిచేసిన కాలానికి ఏడాదికి 100 చొప్పున, పనితీరు ఆధారంగా మరికొన్ని షేర్లూ ఇస్తామని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్